
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా(Teamindia)తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌తో పోరాడుతోంది. ఫాలో ఆన్‌లో విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి కరేబియన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
ప్రస్తుతం ఫాలో ఆన్‌లో వెస్టిండీస్ ఇంకా 28 పరుగులు వెనకబడి ఉంటుంది. క్రీజులో షాయ్ హోప్(92), కెప్టెన్ రోస్టన్ ఛేజ్(23) ఉన్నారు. ఫస్ట్ సెషన్‌లో విండీస్ 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు చేసిన క్యాంప్‌బెల్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
అంతకుముందు పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్ ఆన్ గండాన్ని విండీస్ తప్పంచుకోలేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 తీశారు. వీరిద్దరితో బుమ్రా, సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.
చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..