IND vs SA 1st Test Live Updates: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుతబ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సరికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. వెలుతురు లేమి వల్ల ముందుగానే ఆట ను ముగించారు. కేఎల్ రాహుల్ 13 , వాషింగ్టన్ సుందర్ ఆరు పరుగులతో క్రీజులో నిలిచారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో జైస్వాల్ (12) బౌల్డ్. తొలి వికెట్ కోల్పోయిన భారత్. స్కోరు: 18-1(7). క్రీజులోకి వాషింగ్టన్ సుందర్. కేఎల్ రాహుల్ 17 బంతుల్లో రెండు పరుగులతో ఉన్నాడు.
సౌతాఫ్రికా ఆలౌట్
భారత్‌తో తొలి టెస్టులో తొలి రోజే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల ధాటికి తాళలేక 159 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్‌క్రమ్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(23), ముల్డర్(24) కాసేపు క్రీజులో నిబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల హాల్‌తో చెలరేగాడు. అతడితో పాటు సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెటలు తీశారు.
పదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
బుమ్రా బౌలింగ్ కేశవ్ మహరాజ్ (0) ఎల్బీడబ్ల్యూ కావడంతో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.
తొమ్మిదో వికెట్ డౌన్
బుమ్రా బౌలింగ్‌లో హార్మర్ (5) బౌల్డ్. తొమ్మిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.
ఆలౌట్ దిశగా సౌతాఫ్రికా..
కార్బిన్ బాష్ రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బాష్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(15), హార్మర్(0) ఉన్నారు.
సిరాజ్ ఆన్ ఫైర్..
సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. మార్కో జానెసన్‌ను అద్భుతమైన బంతితో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 48 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 151/7
సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్
సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వెర్రియిన్.. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి మార్కో జానెసన్ వచ్చాడు. 44.4 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 146/6
సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్..
లంచ్ విరామం తర్వాత సౌతాఫ్రికా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వియాన్ ముల్డర్(24) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో డీజోరీ ఎల్బీగా వెనుదిరిగాడు. 33 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(2), కైల్ వెర్రియినే ఉన్నారు.
లంచ్ బ్రేక్‌కు సౌతాఫ్రికా స్కోరెంతంటే?
తొలి రోజు లంచ్ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో టోనీ డి జోర్జీ(15), ముల్డర్(22) ఉన్నాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్..
టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన బవుమా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..
ఐడైన్ మార్‌క్రమ్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన మార్‌క్రమ్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్లకు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(2), ముల్డర్(5) ఉన్నారు.

సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..
57 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్‌ను కోల్పోయింది. 23 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్..జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి వియాన్ ముల్డర్ వచ్చాడు.

5 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోరెంతంటే?
5 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్( మార్‌క్రమ్(0),
భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సమరం షురూ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో బాష్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు.
అదేవిధంగా సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు సైతం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అక్షర్ పటేల్ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడుతున్నాయి.

తుది జట్లు
దక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
భారత్: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


