టాపార్డరే కీలకం: మిథాలీ

India chances at the T20 World Cup will be largely dependent on the top order - Sakshi

న్యూఢిల్లీ: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే సీనియర్‌ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత అవకాశాలు టాపార్డర్‌ రాణించడంపైనే ఆధారపడి ఉంటాయని దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తెలిపింది. ‘భారత టాపార్డరే కీలకం. ఓపెనర్‌ స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ఆమె మ్యాచ్‌ విన్నర్‌. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా బాగా ఆడుతోంది.

ఇటీవలే సఫారీలో అండర్‌–19 మెగా ఈవెంట్‌ గెలుచుకొచ్చిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌ల అనుభవం కూడా భారత సీనియర్‌ జట్టుకు ఉపకరిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లను ఓడిస్తే మిగతా జట్లపై విజయం సులువవుతుంది. బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవాలంటే బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిందే’ అని మిథాలీ విశ్లేషించింది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top