2–2తో సమం | India Argentina womens hockey series drawn | Sakshi
Sakshi News home page

2–2తో సమం

Apr 19 2026 4:54 AM | Updated on Apr 19 2026 4:54 AM

India Argentina womens hockey series drawn

భారత్, అర్జెంటీనా మహిళల హాకీ సిరీస్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకుంది. 

తొలి మ్యాచ్‌లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ కౌర్, అన్ను ఒక్కో గోల్‌ చేశారు. రెండో మ్యాచ్‌ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్‌ తరఫున ఇషిక ఏకైక గోల్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్‌నీత్‌ కౌర్, నేహా ఒక్కో గోల్‌ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 3–2తో నెగ్గింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement