
తొలి వన్డేకు సన్నద్ధం... నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు
Ind Vs Wi ODI Series 2022: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఆదివారం నుంచి ఆరంభం కానున్న తొలి వన్డే కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్ తదితరులు శుక్రవారం ప్రాక్టీసు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ప్రొటిస్ జట్టు చేతిలో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో విండీస్‌తో స్వదేశంలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.
వన్డే కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హిట్‌మాన్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు... శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ తదితరులు కరోనా బారిన పడిన నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్ వన్డే జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
#TeamIndia begin preps in Ahmedabad ahead of the ODI series against West Indies.#INDvWI pic.twitter.com/aYTd1QuexB
— BCCI (@BCCI) February 4, 2022