Surya Kumar Yadav: వన్డే క్రికెట్‌ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్కడు

IND VS WI 2nd ODI: Suryakumar Yadav Became First Batter To Score Six 30 Plus Scores In First Six ODI Innings - Sakshi

విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వరల్డ్‌ రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు ర్యాన్‌ టెన్‌ డస్కటే, టామ్‌ కూపర్‌, పాకిస్థాన్‌ ఆటగాడు ఫఖర్‌ జమాన్‌లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 30కి అదనంగా పరుగులు చేశారు.

తాజాగా సూర్యకుమార్‌ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, విండీస్‌తో రెండో వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌(64), కేఎల్‌ రాహుల్‌(49) రాణించగా.. మిగతా భారత  ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌, ఓడియన్‌ స్మిత్‌ చెరో 2 వికెట్లు, కీమర్‌ రోచ్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హొసేన్‌, ఫేబియన్‌ అలెన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. 
చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top