IND Vs SA 1st Test: పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్‌.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న హెడ్‌ కోచ్‌

IND Vs SA Boxing Day Test: Shreyas Iyer Shocked To See So Much Of Grass On Wicket - Sakshi

సెంచూరియన్‌: మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా.. తొలి టెస్ట్‌ వేదిక అయిన సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌ మైదానంలో అడుగుపెట్టింది. మ్యాచ్‌ ప్రారంభానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. పిచ్‌ పరిశీలిన నిమిత్తం మైదానంలోకి వెళ్లిన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. పిచ్‌పై ఉన్న పచ్చికను చూసి షాక్‌కు గురయ్యానంటూ వ్యాఖ్యానించాడు. పిచ్‌పై చాలా గడ్డి ఉందని, ఇలాంటి వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం బ్యాటర్‌కు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. 

ఈ విషయమై సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మను సంప్రదించగా.. అతను కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిపాడు. వికెట్‌ చాలా తడిగా ఉందని, ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్‌ చాలా కష్టమవుతుందని ఇషాంత్‌ అభిప్రాయపడినట్లు వెల్లడించాడు. వికెట్‌ను పరిశీలించిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ మాట్లాడుతూ‌.. పచ్చికను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ప్రాక్టీస్‌ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. ప్రత్యర్థి జట్టులో రబాడ, నోర్జే లాంటి భీకరమైన ఫాస్ట్‌ బౌలర్లున్నారని, ఇలాంటి వికెట్‌పై వారిని ఎదుర్కోవాలంటే కఠోరమైన ప్రాక్టీస్‌ చేయడమే పరిష్కారమని అభిప్రాయపడ్డాడు. కాగా, సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్‌ 26 నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. 

చదవండి: తనపై లైంగిక దాడి జరగలేదు.. మాట మార్చిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top