IND vs NZ Test Series: కరుణ్‌ నాయర్‌ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు

IND vs NZ: Fans Troll BCCI Not Selecting Hanuma Vihari NZ Test Series - Sakshi

Fans Troll BCCI Not Selecting Hanuma Vihari NZ Test Series..  న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు 16 మందితో కూడిన టీమిండియాను శుక్రవారం బీసీసీఐ ఎంపికచేసిన సంగతి తెలిసిందే. కోహ్లి, రోహిత్‌తో పాటు బుమ్రా, షమీ, రిషబ్‌ పంత్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. కాగా కోహ్లి రెండో టెస్టు ఆడే అవకాశం ఉన్నందున ఇప్పటికైతే తొలి టెస్టుకు రహానే సారధ్యం వహించనున్నాడు. సీనియర్‌ ఆటగాళ్లకు రెస్ట్ పేరుతో విశ్రాంతి ఇవ్వడంతో కేఎస్‌ భరత్‌, జయంత్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన శుబ్‌మన్‌ గిల్‌ కూడా తుది జట్టులోకి వచ్చాడు. ఇలా కొత్త ఆటగాళ్లకు చాన్స్‌ ఇవ్వడంతో జట్టు కొత్తగా కనిపిస్తున్నప్పటికీ హనుమ విహారిని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తు‍న్నారు.

చదవండి: Ind Vs Nz Test Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఇదే

గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో హనుమ విహారి తన ఇన్నింగ్స్‌తో టీమిండియాను పరాజయం నుంచి తప్పించాడు. అలాంటి క్లాస్‌ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న విహారికి చాన్స్‌లు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారని.. వాస్తవానికి రహానే కెప్టెన్‌ కాకపోయుంటే అతన్ని పక్కన పెట్టేసి విహారి చాన్స్‌ ఇచ్చినా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా కరుణ్‌ నాయర్‌ విషయంలో జరిగిన వివక్ష హనుమ విహారికి జరుతుందని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే విహారి కనుమరుగవుతాడని పేర్కొన్నారు.  దీంతోపాటు విహారికి అవకాశం ఇవ్వకపోవడంపై బీసీసీఐని విమర్శిస్తూ టీమిండియా ఫ్యాన్స్‌ వివిధ రకాలుగా ట్రోల్‌ చేశారు.

చదవండి: Team India Coaching Staff: ద్రవిడ్‌ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు:
అజింక్య రహానే(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్ పుజారా(వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ, విరాట్‌ కోహ్లి(రెండో టెస్టు నుంచి అందుబాటులోకి).

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌:
►మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌.
►రెండో టీ20- నవంబరు 19, రాంచి.
►మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా.
►మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌.
►రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top