DT: జట్లలో మార్పులు.. బంగ్లాతో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్‌! | Duleep Trophy 2024: Andhra Player Sheik Rasheed In India A Teamwise Changes | Sakshi
Sakshi News home page

DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్‌ రషీద్‌.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్‌ ఖాన్‌!

Sep 11 2024 9:45 AM | Updated on Sep 11 2024 11:32 AM

Duleep Trophy 2024: Andhra Player Sheik Rasheed In India A Teamwise Changes

భారత ‘ఎ’ జట్టులోషేక్‌ రషీద్‌ 

దులీప్‌ ట్రోఫీ జట్లలో మార్పులు 

రేపటి నుంచి రెండు మ్యాచ్‌లు 

Duleep Trophy second round 2024: దులీప్‌ ట్రోఫీలో రెండో దశ మ్యాచ్‌ల కోసం భారత్‌ ‘ఎ’, ‘బి’, ‘డి’ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ఎంపికైన ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ మేరకు కొత్త ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. 

టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్‌ ఖాన్‌ మాత్రమే దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ కోసం అందుబాటులో ఉండగా... శుబ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, ధ్రువ్‌ జురేల్, కుల్దీప్‌ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, యశ్‌ దయాళ్, అక్షర్‌ పటేల్‌ మాత్రం తమ జట్లను వీడారు.

‘బి’ టీమ్‌లో రింకూ సింగ్
ఇక కొత్తగా ప్రకటించిన ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌కు చోటు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్‌  ఐపీఎల్-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో ఉన్నాడు. అదే విధంగా.. 2022లో అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన భారత జట్టులోనూ రషీద్‌ కీలక సభ్యుడు. ఇదిలా ఉంటే... రషీద్‌తో పాటు ప్రథమ్‌ సింగ్, అక్షయ్‌ వాడ్కర్, షమ్స్‌ ములాలీ, ఆకిబ్‌ ఖాన్‌ ‘ఎ’ టీమ్‌లోకి ఎంపికయ్యారు.

ఇక ‘ఎ’ జట్టు కెప్టెన్‌‌గా శుబ్‌మన్‌ గిల్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ‘బి’ టీమ్‌లో రింకూ సింగ్, సుయశ్‌ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి ఎంపికవ్వగా...సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమ్‌తో కొనసాగుతాడు. ఇండియా ‘సి’ టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు కానీ ‘డి’ జట్టులో నిశాంత్‌ సంధు ఎంపికయ్యాడు.

అనంతపురంలోనే
గత మ్యాచ్‌లో ‘డి’ టీమ్‌లో ఉండి గాయపడిన తుషార్‌ దేశ్‌పాండే స్థానంలో విద్వత్‌ కావేరప్పను తీసుకున్నారు. కావేరప్ప గత మ్యాచ్‌ ‘ఎ’ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. దులీప్‌ ట్రోఫీ రెండో రౌండ్‌లో భాగంగా ‘ఎ’, ‘డి’ మధ్య...‘బి’, ‘సి’ మధ్య రెండు మ్యాచ్‌లు అనంతపురంలోనే జరుగుతాయి. ఈ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా...భారత జట్టు సభ్యులకు ఈ నెల 12 నుంచి బెంగళూరులో సన్నాహక శిబిరం మొదలవుతుంది. 

ఇండియా-‘ఎ’ (అప్‌డేటెడ్‌)
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుమార్ కుశాగ్రా, అక్షయ్ వాడ్కర్, శస్వత్ రావత్, ప్రథమ్ సింగ్, తనూష్ కొటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, ఎస్కే రషీద్, షంస్ ములానీ, ఆఖిబ్ ఖాన్

ఇండియా-బి(అప్‌డేటెడ్‌)
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి

ఇండియా-సి(మార్పులు లేవు)
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.

ఇండియా-డి(అప్‌డేటెడ్‌)
శ్రేయస్ అయ్యర్‌ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్, ఆదిత్య థాకరే, దేవ్‌దత్‌ పడిక్కల్, రికీ భుయ్, శరణ్ష్ జైన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వత్ కావేరప్ప, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement