Watch: Foot Baller Ivan Rakitic Strips Down To His Underwear On Pitch To Gift Sevilla Kit To Fans - Sakshi
Sakshi News home page

Ivan Rakitic: మైదానంలో బట్టలు విప్పి రచ్చరచ్చ చేసిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

Apr 5 2022 9:05 PM | Updated on Apr 5 2022 9:57 PM

Croatian Foot Baller Ivan Rakitic Strips Down To His Underwear To Gift Sevilla Kit To Barcelona Fans - Sakshi

ప్రత్యర్ధి జట్టు ఆటగాడు అని కూడా చూడకుండా తనపై అభిమానంతో మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు క్రొయేషియన్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ ఇవాన్ రాకిటిక్ తనదైన స్టైల్‌లో థ్యాంక్స్‌ చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం మైదానంలోనే బట్టలు విప్పి ప్రత్యర్ధి జట్టు అభిమానులకు ఇచ్చేశాడు. అనంతరం అండర్‌వేర్‌తోనే మైదానం మొత్తం తిరుగుతూ స్టాండ్స్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.


ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా బార్సీలోనా-సెవిల్లా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బార్సీలోనా 1-0 తేడాతో విజయం సాధించింది. బార్సిలోనా తరఫున పేద్రీ 72వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పెద్రీతో పాటు సెవిల్లా ఆటగాడు ఇవాన్ రాకిటిక్‌ కూడా హీరో అయ్యాడు. తన జట్టు ఓటమి పాలైనప్పటికీ అద్భుతమైన ఆటతీరు కనబర్చి ప్రత్యర్ధి జట్టు అభిమానుల మద్దతు చూరగొన్నాడు. 
చదవండి: దుమ్మురేపుతున్న టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు.. భవిష్యత్తు వీళ్లదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement