
రావణునికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన్ని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. రావణుడికి కరోనా సోకడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వీడియో చూసేయండి మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఓ ఆంబులెన్స్‌పై రావణుడి దిష్టిబొమ్మను తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుసాంత తన అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్టు చేస్తూ 2020లో రావణుడు ఆంబులెన్స్‌లో కోవిడ్ ఆసుపత్రికి వెళ్తున్నాడు అంటూ క్యాప్షన్‌ను జోడించగా, మరో అధికారి రావణుడికి కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోలో రావణుడికి ఒక తలే ఉందేంటి? మిగతా తొమ్మిది ఏమయ్యాయి అంటూ ఓ యూజర్ ప్రశ్నించగా, ఈ సంవత్సరం 2020లో ఏమేమి చూడాల్సి వస్తుందో అంటూ ట్వీట్ చేశారు.
2020😳😳
— Susanta Nanda IFS (@susantananda3) October 24, 2020
Ravana going in Ambulance to COVID Hospital.... pic.twitter.com/v04Xw1wN8L