సమన్వయంతో పనిచేయండి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయండి

Mar 7 2026 10:09 AM | Updated on Mar 7 2026 10:09 AM

మెదక్‌జోన్‌/మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి ఉమ్మడి మెదక్‌ జిల్లాను టాప్‌లో నిలపాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాను టాప్‌లో నిలపండి

ఇన్‌చార్జి మంత్రి వివేక్‌

కలెక్టరేట్‌లో ప్రజాపాలన– ప్రగతి

ప్రణాళిక సన్నాహక సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement