సమస్యల పరిష్కారానికి ‘ప్రగతి ప్రణాళిక’ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ‘ప్రగతి ప్రణాళిక’

Mar 7 2026 10:09 AM | Updated on Mar 7 2026 10:09 AM

ప్రజలకు అందుబాటులో వైద్యం: రవీంద్రనాయక్‌ చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రజారోగ్య రాష్ట్ర సంచాలకులు డాక్టర్‌ రవీంద్రనాయక్‌ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు పీహెచ్‌సీలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్‌, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట నోడల్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు శ్రీనివాస్‌, మహేందర్‌ రెడ్డి, నిర్మల, దీప్తి, మీనా, ఐశ్వర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

గజ్వేల్‌: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’దోహదపడుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం 99రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గంగిశెట్టి చందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పాలన తీరు మెరుగుపరచడంతోపాటు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాగా 16వార్డులో శిథిలావస్థలో ఉన్న మొండి గోడలను తొలగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కళ్యన్‌కర్‌ పద్మాబాయి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పాఠశాల తనిఖీ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి సంతోష్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, భోజనశాలను, స్టాక్‌ రూంలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు న్యాయ సంబంధిత విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్‌రావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు గుర్తింపుతో వైకల్య నివారణ

– డీఎంహెచ్‌ఓ ధనరాజ్‌

సిద్దిపేటకమాన్‌: పిల్లల్లో ముందస్తుగా వైకల్యాలను గుర్తించి వాటిని నివారించవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. ఐఏంఏ హాల్‌లో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఏఎన్‌ఎంలకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో ఏమైనా వైకల్యాలు ఉంటే స్క్రీనింగ్‌ ద్వారా గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తామన్నారు. జాతీయ మేధో దివ్యాంగుల స్వాధికార సంస్థ ద్వారా అవసరమైన డిజిటల్‌ పరికరాలు అందింస్తారని చెప్పారు. స్క్రీనింగ్‌కు సంబంధించిన కిట్‌లను వైద్య సిబ్బందికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌బాబ్జి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement