తపస్‌పల్లికి నీరు మళ్లిస్తే | - | Sakshi
Sakshi News home page

తపస్‌పల్లికి నీరు మళ్లిస్తే

Mar 7 2026 10:09 AM | Updated on Mar 7 2026 10:09 AM

బీఆర్‌ఎస్‌ నేతల హెచ్చరిక నీటిని తరలించేందుకుఎంపీ చామల కుట్ర రెండు ప్రాంతాల మధ్యచిచ్చు పెడుతున్నారని మండిపాటు

తడాఖా చూపిస్తాం

నంగునూరు(సిద్దిపేట): రంగనాయకసాగర్‌ నీటిని తపస్‌పల్లికి మళ్లిస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. నంగునూరు మండలంలోని ఎల్‌డీ 10 కాలువ వద్ద ఓటీఆర్‌ పనులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు లింగంగౌడ్‌ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎస్‌ఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రంగనాయక సాగర్‌ నీటిని తరలించేందుకు ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై ఒత్తిడి తేవడం మానుకోవాలని చెప్పారు. గతంలో తపాస్‌పల్లి కాలువ నిర్మాణం కోసం తాము భూములు కోల్పోయామని, ఇప్పుడు నీటిని తరలిస్తే నంగునూరు మండలంలోని ఏడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. నాడు కాలువ పూర్తి కాకుండా కమలాయపల్లి రైతులు అడ్డుకోగా.. ఇప్పుడు కాల్వ ఎలా తీస్తారని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కిందట నీటిని తరలించేందుకు ఎంపీ కుట్ర పన్ని రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడంతో అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు. ఎంపీ చామల తమ ప్రయత్నాలను మానుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చ రించారు. ఒక ప్రాంతానికి నీరు తరలించి.. భూములు కోల్పోయిన తమకు నష్టం చేకూ ర్చడం సమంజసమని వారు ప్రశ్నించారు. ఒకవేళ నీటిని మళ్లించేందుకు యత్నిస్తే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement