వెల్‌నెస్ సేవలు విస్తృతం
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వైద్య సేవలందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్ సేవలు మరింత విస్తృతం అయ్యాయి. సిద్దిపేట పట్టణంలోని పాత ఎంసీహెచ్ భవనంలో వెల్‌నెస్ సెంటర్ కొనసాగుతోంది. జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న జనరల్ మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, సైకియాట్రీ విభాగాల్లో వైద్య సేవలు అందనున్నాయి. ఇక నుంచి వెల్‌నెస్ సెంటర్‌కు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించడంతో ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షణలో కొనసాగనుంది. అదేవిధంగా వెల్‌నెస్‌లో గైనకాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్, సైకియాట్రి విభాగాల్లో రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడాలని, మెరుగైన వైద్య సేవలందించాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలని వెల్‌నెస్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ సంగీత తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ చందర్, డాక్టర్ సదానందం, వెల్‌నెస్ సెంటర్ ఇన్‌చార్జి ప్రసాద్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎనిమిది విభాగాల్లో ఓపీ వైద్య సేవలు
నోడల్ ఆఫీసర్‌గా ప్రభుత్వాస్పత్రి
సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత


