హరీశ్‌రావు సమక్షంలో చేరికలు
గజ్వేల్: మండల పరిధి కొడకండ్ల గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పండరి రవీందర్‌రావు, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షులు బెండె మధు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన బీఆర్‌ఎస్ నాయకుడు శేక్‌భాస్కర్ కుటుంబీకులను హరీశ్‌రావు కోమటిబండ గ్రామంలో పరామర్శించారు.


