‘బొమ్మ’ ఆశయాలను కొనసాగిస్తాం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్ భూక్య రాజేశ్వరికి సన్మానం
హుస్నాబాద్: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బొమ్మ వెంకటేశ్వర్లు జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బలహీన వర్గాల ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి వెంకటేశ్వర్లు అని కొనియాడారు. ఈ ప్రాంతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్బంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం పని చేశారన్నారు. మార్గదర్శిగా ఉన్న బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ హస్సెన్ తదితరులు ఉన్నారు.
సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం
హుస్నాబాద్ మండలం వంగ రామయ్య పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న భూక్య రాజేశ్వరి తిరుపతిని మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికై న ఉప సర్పంచ్ దండుగుల రాజుతో పాటుగా వార్డు సభ్యులను సన్మానించారు.


