వందేమాతరం.. స్ఫూర్తికి వందనం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ గేయం ‘వందేమాతరం’ను రచించి 150 ఏళ్లయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. శుక్రవారం అన్ని విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది ఉదయం 10గంటలకు ఆలపించారు. అనంతరం విద్యార్థులకు వందేమాతరం గేయంపై క్వీజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వందేమాతరం ఆకృతిని ప్రదర్శించారు.
అందరూ ఏకతాటిపైకి: డీఈఓ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వందేమాతరంపై నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం గేయం భారతీయులను ఏకం చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వందేమాతరం.. స్ఫూర్తికి వందనం
వందేమాతరం.. స్ఫూర్తికి వందనం


