బీడీ పరిశ్రమను కాపాడండి | - | Sakshi
Sakshi News home page

బీడీ పరిశ్రమను కాపాడండి

Nov 8 2025 9:36 AM | Updated on Nov 8 2025 9:36 AM

బీడీ

బీడీ పరిశ్రమను కాపాడండి

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించండి డాంబర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయొద్దు అక్కన్నపేటకు రూ.16కోట్లు మంజూరు

కేంద్ర మంత్రికి బీఎమ్మెస్‌ వినతి

సిద్దిపేటజోన్‌: రాష్ట్ర గ్రామీణ ఉపాధి బీడీ పరిశ్రమ పరిరక్షణకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని భారతీయ మాజ్దుర్‌ సంఘ్‌ (బీఎమ్మెస్‌) రాష్ట్ర అధ్యక్షుడు కలాల్‌ శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూర్‌ మండవకు వినతిపత్రం అందజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమావేశంలో పాల్గొన్న మంత్రికి సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలో బీడీ పరిశ్రమ పరిస్థితి, ఇబ్బందులు గురించి వివరించారు. కార్మికుల పెన్షన్‌ రూ.5వేలకు పెంచాలని, అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.

న్యాయమూర్తి సంతోష్‌కుమార్‌

సిద్దిపేటకమాన్‌: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌కుమార్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా జిల్లా జైలులో శుక్రవారం అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని అన్నారు. న్యాయవాదులు లేని వారికి లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ సహాయం అందిస్తారని తెలిపారు. ఖైదీల వంట గది, స్టోర్‌ రూంను పరిశీలించి, వారికి కల్పిస్తున్న భోజన వసతుల గురించి జైలు సిబ్బందిని న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆరేళ్లుగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డు పాలయ్యారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సర్కార్‌ తీరుతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లక్ష్మణ్‌ నాయక్‌, కిషోర్‌, మహేష్‌, రాజు, నవీన్‌ తదితరులు ఉన్నారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మల్లారం శివారులో డాంబర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎంపీడీఓ జనార్దన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని నివాసాల సమీపంలో డాంబర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం వల్ల వాతావరణం కలుషితం అవుతుందన్నారు. ప్లాంట్‌ ద్వారా వచ్చే డస్టుతో పంట పొలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోయారు. డాంబర్‌ ప్లాంట్‌ నిర్మాణం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

అక్కన్నపేట(హుస్నాబాద్‌):మండలానికి బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్లు మంజూరైనట్లు గిరిజన శాఖ ఏఈ దిలీప్‌ శుక్రవారం పేర్కొన్నారు. కేశనాయక్‌తండా, దుబ్బతండా, పంచరాయితండా, తుక్కితండా, దేవనాయక్‌తండా, పంతుల్‌తండా, ఫన్యానాయక్‌తండాలతో పాటు తదితర తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ నేత ధరావత్‌ తిరుపతినాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

బీడీ పరిశ్రమను కాపాడండి 1
1/3

బీడీ పరిశ్రమను కాపాడండి

బీడీ పరిశ్రమను కాపాడండి 2
2/3

బీడీ పరిశ్రమను కాపాడండి

బీడీ పరిశ్రమను కాపాడండి 3
3/3

బీడీ పరిశ్రమను కాపాడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement