జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి
అక్కన్నపేట(హుస్నాబాద్): ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కాశబోయిన రాజవ్వ ఇంటి నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం..ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్‌చైర్మన్ ఎగ్గిడి ఐల్లయ్య, కట్కూర్ గ్రామ సింగిల్ విండో వైస్‌చైర్మన్ ముకుందంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, నాయకులు ముత్యాల సంజీవ్‌రెడ్డి, చింతల బాల్‌రెడ్డి, మోతిలాల్‌నాయక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎస్సీలకు 18 శాతం
రిజర్వేషన్లు కేటాయించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ...ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ ఇద్దరు మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించానన్నారు.
సోషల్ మీడియాకు
దూరంగా ఉండాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సోషల్ మీడియాకు ఎంతదూరం ఉంటే భవిష్యత్ బాగుటుందని సిద్దిపేట షీటీమ్ ఏఎస్‌ఐ కిషన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శనివారం విద్యార్థులకు మహిళా రక్షణకు ఉన్న చట్టాలు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, షీటీమ్, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ కలిసిమెలసి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్‌లను ఎత్తవద్దన్నారు. బాలికలు, మహిళల భద్రతకు షీటీమ్, పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రజనీకాంత్ పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఫీజుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. తక్షణమే ఫీజులు విడుదల చేయకుంటే ఛలో హైదరాబాద్ పేరు తో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల అభిషేక్ భాను తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు