
డ్రై డే పాటిద్దాం
పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్
సిద్దిపేటకమాన్: ప్రతి శుక్ర, మంగళవారాల్లో డ్రై డే పాటించాలని పైలేరియా సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో వైద్య సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వినియోగంలో లేని వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.