
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
అదనపు కలెక్టర్ హమీద్
ములుగు(గజ్వేల్): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ హమీద్ సూచించారు. గురువారం మండలంలోని నర్సాపూర్, సింగన్నగూడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించిన రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఆన్‌లైన్ పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ ఆరీఫా, ఆర్‌ఐ హరీష్, ఏఈఓ అనూజ్ణ, నాయకులు పాల్గొన్నారు.