
అర్జీలు సత్వరం పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజలు అందించిన అర్జీలు సత్వర పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి గరిమా అగర్వాల్.. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందిస్తున్న బాధితులకు సత్వరం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధించిన పురోగతిపై తనకు తెలియజేయాలన్నారు. పరిష్కారం కోరుతూ భూ సంబంధిత, హౌసింగ్, పింఛన్లు తదితర వాటిపై మొత్తం 75దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
మా పేర్లపై నమోదు చేయండి
మేము మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు చెందిన భూ భాధితులం. గజ్వేల్ మండలం మిస్నామిరాపల్లి లోని వక్ఫ్‌బోర్డు లో 70 మంది కలిసి సుమారు 250 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. ఈ భూమి ఇంకా మా పేరు మీద నమోదు కాలేదు. ఇప్పటికై నా అధికారులు ఆ భూమిని మా పేర్లపై మార్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
– మల్లన్నసాగర్ భూ బాధితులు