
డిగ్రీ పరీక్షలకు చివరి అవకాశం
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీ చదివి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. 2000 నుంచి 2015 సంవత్సరం వరకు డిగ్రీ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు బ్యాక్‌లాగ్ పేపర్లు పాస్ అయ్యేందుకు చివరి అవకాశంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాడమిక్ సెనెట్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పరీక్షలు 2015–16 విద్యా సంవత్సరం నాటి పాత సిలబస్ (పథకం) ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు జూన్ 17లోగా చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత కళాశాలలో సంప్రదించాలన్నారు.
సర్కారు బడులను
బలోపేతం చేద్దాం
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచుతూ బలోపేతం చేయాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించి బోధనలో నైపుణ్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, దూల్మిట్ట మండల విద్యాశాఖ అధికారులు వరదరాజు,మీనాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాల విక్రయాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రస్తుత విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయాలకు అనుమతి కోరుతూ దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు విక్రయదారులకు కావాల్సిన పాఠ్య పుస్తకాల ఇండెంట్‌తో, రూ.1000 బ్యాంకు డీడీని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బి.వివేక్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచేందుకు ప్రతిపాదనలు పంపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కళాశాలలు తప్పుడు ఆడిట్ లెక్కలు చూపిస్తూ అధిక ఫీజులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పరశురాం, అనీష్, భాను ప్రసాద్, అభినయ, కార్తీక్, గణేష్ , అఖిల్, పవన్, విఘ్నేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాలపన్నుపై అవగాహన
సిద్దిపేటరూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పన్నులపై సిద్దిపేట, మెదక్ జిల్లాల సహకార సంఘాల సభ్యులతో ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ సీహెచ్.రాకేశ్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను గూర్చి వివరించారు. అంతకుముందు జిల్లా ఆదాయపు పన్ను శాఖ అధికారి రమణారావు ఆదాయపు పన్ను దాఖలు విధానం గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జాయింట్ కమిషనర్ రాకేశ్.. కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డీసీఓ నాగేశ్వర్‌రావు, డీజీఎం విశ్వేశ్వర్, ఏజీఎం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్షలకు చివరి అవకాశం