
‘ఉపాధి’పై అలసత్వం తగదు
● డీఆర్‌డీఏ ఏపీడీ బాలకృష్ణ ● పనులపై సామాజిక తనిఖీ
వర్గల్(గజ్వేల్): ఉపాధిహామీ పథకం అమలులో అలసత్వం తగదని, నిర్వహణలో లోపాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలకృష్ణ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం వర్గల్ రైతువేదికలో 16వ విడత ఉపాధిహామీ పథకం పనులపై ఆయన సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం నివేదికలను గ్రామాల వారీగా సమీక్షించారు. వివిధ పనులలో పొరపాట్లను తనిఖీ బృందం సభ్యులు ఏపీడీ దృష్టికి తెచ్చారు. అందుకు బాధ్యులైన ఉపాధి సిబ్బంది నుంచి రూ.7,400 రికవరీ చేయాలని ఏపీడీ ఆదేశించారు. రూ.7వేలు జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏపీడీ శివాజీ, శ్రీనివాస్‌గౌడ్, అంబుడ్స్‌మెన్ ఆరిఫ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సంతోష్‌రెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, ఎస్‌ఆర్‌పీ పాండురంగం, ఎంపీఓ ఖలీమ్, ఏపీఓ జనార్దన్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు హాజరయ్యారు.