
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● పరీక్షలు రాయనున్న 9,531 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రథమ సంవత్సరం 5,654, ద్వితీయ సంవత్సరం 3,877 మందితో మొత్తం 9,531 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనున్నాయి.