
కాంగ్రెసోళ్లకేనా ఇందిరమ్మ ఇళ్లు?
దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని బ్రోకర్ల జేబులు తడిపితేనే ఇళ్లు మంజూరు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దుబ్బాకలోని క్యాంపుకార్యాలయంలో నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీలో కాంగ్రెస్ వారే ఉన్నారని, వారి పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ దళారులు విచ్చలవిడిగా పేదలనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని తెలిపారు. పోలీస్‌వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని.. దుబ్బాక, మిరుదొడ్డిలలో ఎస్‌ఐలు లంచాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి