
శిక్షణ శిబిరాలు
పిల్లలను ప్రోత్సహించేందుకే
● సిద్దిపేట మున్సిపల్
చైర్‌పర్సన్
మంజుల
● సాక్షి, అంబిటస్
పాఠశాల
ఆధ్వర్యంలో..
● ఉచిత వేసవి శిక్షణ
శిబిరం ప్రారంభం
సిద్దిపేటకమాన్: వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కడవెర్గు మంజుల రాజనర్సు అన్నారు. శనివారం సాక్షి, అంబిటస్ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని అంబిటస్ పాఠశాలలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై, అంబిటస్ పాఠశాల కరస్పాండెంట్ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించి, భవిష్యత్‌లో వారు ఏమి కావాలనుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. శిక్షణ శిబిరంలో కరాటే, యోగా, మ్యూజిక్, హ్యాండ్ రైటింగ్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లను ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పిల్లలు బయట తిరగడం వల్ల వడదెబ్బ భారిన పడి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా ఏదో ఒక అంశంపై పట్టు సాధించాలన్నారు. 15రోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఉచిత వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్న సాక్షి మీడియా, అంబిటస్ పాఠశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. సుమారు వంద మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్‌రెడ్డి, డ్యాన్స్ మాస్టర్ వాసుదేవ్, కరాటే మాస్టర్ భాగ్యరాజ్, చిన్నా, టీచర్లు అపర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ శిబిరాలు

శిక్షణ శిబిరాలు