
దార్శనికుడు బసవేశ్వరుడు
సిద్దిపేటఅర్బన్: సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం పొన్నాల వై జంక్షన్ వద్ద బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుడి జయంతి వేడుకలలో హరీశ్‌రావు పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ వివక్షత లేకుండా సమసమాజం, సమన్యాయం కోసం పోరాడిన మహానీయుడని అన్నారు. బసవేశ్వరుడి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి నాగరాజమ్మ, లింగాయత్ సంఘాల జిల్లా అధ్యక్షుడు, పట్టణ గౌరవ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు