గజ్వేల్‌రూరల్: అభివృద్ధిలో భాగస్వాములై భూములు కోల్పోయిన దళితులందరికీ దళితబంధు అమలు చేసి ఆదుకోవాలని మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడిస్వామి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో దళితులు విలువైన భూములను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలైన్, డంపింగ్‌యార్డుతో పాటు కాల్వల కోసం దళితులకు చెందిన సుమారు 45ఎకరాల వరకు భూసేకరణ చేపట్టారని గుర్తు చేశారు. భూమినే నమ్ముకున్న దళితులు ఎటువంటి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు.