అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

సంగారెడ్డి జోన్‌: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయంతోపాటు డివిజన్‌ స్థాయిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement