గ్రామాభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగు, బొంతపల్లి గ్రామాల్లో న్యూలాండ్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ ఆగ్రో ఫౌండేషన్‌ సహకారంతో సీఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ కుమార్‌ గౌడ్‌ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 8 గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 14 బయోగ్యాస్‌ యూనిట్లు, రూ.6 లక్షల వ్యయంతో 16 వర్మీ కంపోస్ట్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్‌ రెడ్డి, రాజారెడ్డి, కృష్ణ, చక్రపాణి, కుమార్‌ గౌడ్‌, జైపాల్‌ రెడ్డి, నాయకులు మహేష్‌, శేఖర్‌ రెడ్డి, హుస్సేన్‌, న్యూలాండ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు సిఎస్‌ఆర్‌ హెడ్‌ రవి, ప్రతాప్‌ సింగ్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ సూర్యభగవాన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement