తాపీ మేసీ్త్రలకూ ప్రమాద బీమా పత్రాలు | - | Sakshi
Sakshi News home page

తాపీ మేసీ్త్రలకూ ప్రమాద బీమా పత్రాలు

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

సంగారెడ్డి: సిమెంట్‌ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్‌ గ్రూపుకి చెందిన భారతి సిమెంట్‌ ఎదుగుతుందని ఆ సంస్థ టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ అన్నారు. చౌటకూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్‌ ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు సోమవారం సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికాట్‌ గ్రూప్‌ కంపెనీస్‌ ప్రపంచంలో 12 దేశాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అనంతరం డీలర్‌ అభిలాష్‌ మాట్లాడుతూ భారతి సిమెంట్‌ సర్వీస్‌ చాలా ఫాస్ట్‌ గా ఉంటుందని, అధికంగా సేల్స్‌ అవుతుందని తెలియజేశారు. అల్ట్రాఫాస్ట్‌ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్‌ కాంక్రీట్‌ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్‌ ఇంజనీర్లు సైట్‌ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. ఇంటి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా పత్రాలను ఆ సంస్థ టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ అందజేశారు. ఈ సమావేశంలో భారతి సిమెంట్‌ డీలర్‌ అభిలాష్‌, ట్రేడర్స్‌ యజమాని, 50 మంది తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement