సంగారెడ్డి టౌన్: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావడం మొదటిరోజే బడికి వెళ్లి తోటి స్నేహితులను, ఉపాధ్యాయులను కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చేది. పాత ఉపాధ్యాయుల దీవెనలు, కొత్త తరగతి ఉపాధ్యాయుల పరిచయం, వారి పాఠాలు మొదలయ్యే విధానం అన్నీ ఒక మధురమైన జ్ఞాపకం. పాఠశాలకు హాజరయ్యే పిల్లలకు స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకునేలా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
– సౌజన్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి


