సంగారెడ్డి జోన్: నా చిన్నతనంలో తొలి రోజు పాఠశాలకు చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. కొత్త స్నేహితులు, ఉపాధ్యాయులు కలుసుకుంటారని సంతోషం ఉండేది. మొదటి రోజు పాఠశాల అంటే ఏ విధంగా ఉంటుందోననే భయంతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లేదాన్ని. సెలవుల తర్వాత స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తుంటే అదో మధురానుభూతి. కొత్త పుస్తకాలు, బ్యాగు, షూస్ వేసుకుని అందరితో వెళ్లేవాళ్లం. పుస్తకాలకు ర్యాపర్స్ వేసుకుని వాళ్లం. ప్రతీ ఒక్కరు బాగా చదువుకోవాలి. ఉన్నత లక్ష్యాలను నిర్దేషించుకుని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి.
– టీఎల్. సంగీత, అదనపు కలెక్టర్, సంగారెడ్డి


