బడి గంటకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

బడి గంటకు వేళాయె..

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

విద్యార్థులకు స్వాగతం పలకనున్న ఉపాధ్యాయులు

ఈ సారి 130 స్కూళ్లల్లో ప్రీ ప్రైమరీ

వేసవి సెలవులతో బిజీబిజీగా గడిపిన చిన్నారులు సోమవారం నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. స్కూళ్లను అందంగా అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలనున్నారు. ప్రభుత్వ బడుల్లో 1వ తరగతి నుంచి ప్రారంభమవుతుండటంతో గ్రామాల్లో చిన్నారులను తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారు.

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌:

పాఠశాల మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా పుస్తకాలు చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 7,14,660 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 6,95,220 పుస్తకాలు వచ్చాయి. ఇప్పటివరకు 5,90,000 పుస్తకాలను ఆయా మండలాలకు సంబంధించిన ఎంఆర్‌సీ కార్యాలయాలకు పంపిణీ చేశారు. 7వ తరగతికి సంబంధించిన హిందీ పుస్తకాలు మాత్రమే రాలేదు. అవి కూడా రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు 7,76,658 నోట్‌ బుక్‌లు అవసరం కాగా కొండాపూర్‌, మనూర్‌, నాగలిగిద్ద, నిజాంపేట, మొగుడంపల్లి మండలాలకు మినహా మిగతా అన్నిచోట్లకు నోట్‌పుస్తకాలు అందాయి.

ఎంఆర్‌సీలోనే పాఠ్యపుస్తకాలు

గత మూడేళ్లుగా ప్రవేశాలిలా..

సంవత్సరం 1వ తరగతి 6వ తరగతి

2023–24 10,647 11,400

2024–25 11,105 9,728

2025–26 11,230 10,438

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement