మంచుకొండల్లో తెలంగాణ రుచులు | - | Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో తెలంగాణ రుచులు

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

● 15వ సారి అమర్‌నాథ్‌ యాత్రికులకు అన్నదానం ● ఈ నెల 15న సరుకులతో వెళ్లనున్న లారీలు

● 15వ సారి అమర్‌నాథ్‌ యాత్రికులకు అన్నదానం ● ఈ నెల 15న సరుకులతో వెళ్లనున్న లారీలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మంచు కొండల్లో తెలంగాణ రుచులను అమర్‌నాథ్‌ యాత్రకు వచ్చే భక్తులకు అందించనున్నట్లు, అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సంస్థ చైర్మన్‌ మధు, అధ్యక్షుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మంచుకొండల్లో అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్‌ యాత్ర ఎంతో పవిత్రమైందన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు 15వ సారి దక్షిణాది రుచులను అందించడానికి ఈనెల 15న సరుకుల లారీలు వెళ్తున్నట్లు తెలిపారు. భక్తులకు బాల్తాల్‌, పంచతరని, అమర్‌నాథ్‌ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు. సరుకుల లారీలను 15న సిద్దిపేట శరబేశ్వర ఆలయంలో శివకల్యాణం అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ రఘునందన్‌ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌, కాశీనాథం, రమేశ్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement