వర్గల్‌ పూలే డిగ్రీ కళాశాలలో 15న స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

వర్గల్‌ పూలే డిగ్రీ కళాశాలలో 15న స్పాట్‌ అడ్మిషన్లు

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం వివిధ కోర్సులలో ప్రవేశానికి ఈనెల 15న స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఎంజేపీలో దరఖాస్తు చేసుకున్నా, చేసుకోలేకపోయినా స్పాట్‌ అడ్మిషన్‌ కోసం విద్యార్థినులు సోమవారం ఉదయం 11గంటలలోపు కళాశాలలో తమ పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 12 గంటల నుంచి మెరిట్‌ ప్రాతిపదికన వీరికి సీటు కేటాయిస్తామన్నారు. అభ్యర్థులు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ఫామ్‌–2026, ఒరిజినల్‌ టెన్త్‌, ఇంటర్‌ మెమోలు, ఇంటర్‌ టీసీ, కులం, ఆదాయం(లేటెస్ట్‌) సర్టిఫికెట్‌ తీసుకొనిరావాలన్నారు. వివరాల కోసం 97035 29664 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

మహిళ అదృశ్యం

సంగారెడ్డి క్రైమ్‌: కుమార్తె వద్దకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వీరదాస్‌ నయోమి (45) నాలుగేళ్లుగా సంగారెడ్డిలోని గొల్లగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ తన భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే పట్టణంలోని అహ్మద్‌ నగర్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్తానని ఈ నెల 9వ తేదిన ఇంటి నుంచి బయలుదేరి తిరిగిరాలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చేగుంటకులో ఆటో డ్రైవర్‌

చేగుంట(తూప్రాన్‌): ఓ ఆటో డ్రైవర్‌ అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ద్దిపేట జిల్లా సూరంపల్లికి చెందిన పాములపర్తి స్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం తన ఆటోను తీసుకొని చేగుంటకు వచ్చి బంధువుల ఇంటి వద్ద పార్కింగ్‌ చేసి వెళ్లిపోయాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ ఉంది. బంధువుల వద్ద వెతికినా చేస్తున్నట్లు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్యాన్సర్‌తో వ్యక్తి ఆత్మహత్య

నర్సాపూర్‌ రూరల్‌: క్యాన్సర్‌ కారణంగా గొంతు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రంజిత్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కి చెందిన పుల్కంటి పెద్దిరాజు (41) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల గొంతు నొప్పి ఎక్కువగా రావడంతో బసవతారకంతో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినప్పటికీ గొంతు నొప్పి తగ్గకపోవడంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చికిత్స పొందుతూ

కార్మికుడు మృతి

జిన్నారం(పటాన్‌చెరు): ఓ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తూ యువకుడు మృతిచెందిన ఘటన గుమ్మడిదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం కాసాలకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ (26) బొంతపల్లి పారిశ్రామికవాడలోని మైత్రి డ్రగ్స్‌ పరిశ్రమలోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 3న విధులు నిర్వరిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం కార్మికుడిని సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరుసటి రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు పరిశ్రమ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.80 లక్షలతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించేలా ఒప్పందం కుదిరింది. కాగా గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వైద్యులు కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి తండ్రి నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement