హక్కులు హరిస్తున్న కేంద్రం | - | Sakshi
Sakshi News home page

హక్కులు హరిస్తున్న కేంద్రం

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

హక్కులు హరిస్తున్న కేంద్రం

కొమురవెల్లి(సిద్దిపేట): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్‌ మాట్లాడుతూ వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపుతో నిత్యావసర సరుకుల ధరలు బగ్గుమంటున్నాయని అన్నారు. దీంతో పేదల బతుకులు భారంగా మారాయన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, ఎన్‌డీఏ ప్రభుత్వం జీ రామ్‌ జీ చట్టాన్ని తెచ్చి పేదల పొట్ట కొడుతోందన్నారు. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులను హరించేందుకే కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్స్‌ తెచ్చిందన్నారు. మహాసభలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, కాముని గోపాలస్వామి, అరుణ్‌ కుమార్‌, తాటోజు రవీంద్ర చారి, పొట్టేళ్ల స్వామి, ఉల్లంపల్లి సాయిలు, తాడూరి కవిత, బోయని మల్లేశం, బాలకృష్ణ, రవీందర్‌, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

పెట్రో ధరల పెంపుతో పేదలకు భారం

వ్యవసాయ కార్మిక సంఘం

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement