జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలు నడపండి | - | Sakshi
Sakshi News home page

జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలు నడపండి

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలు నడపండి

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలు నడపాలని కోరుతూ మహిళలు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. కౌన్సిలర్‌ నామ స్రవంతి ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్టాఫీసు నుంచి ఉత్తరాలను పీఎం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ స్రవంతి మాట్లాడుతూ జహీరాబాద్‌ అభివృద్ధి చెందుతుందని, నిమ్జ్‌కు వేల ఎకరాల భూములు ఇక్కడి రైతులు ఇచ్చారన్నారు. మొదటి బుల్లెట్‌ రైలు జహీరాబాద్‌ మీదుగా నడపాలని ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఏమీ జరిగిందో తెలియదు కానీ తరువాత డీపీఆర్‌ మార్చి వికారాబాద్‌కు మళ్లించారని వాపోయారు. వాపోయారు. జహీరాబాద్‌ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డీపీఆర్‌ను రద్దు చేసిన జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలును నడపాలని ఆమె కోరారు.

ప్రధానికి మహిళల లేఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement