శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

సంగారెడ్డి జోన్‌: సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన వ్యర్థాల నిర్వహణను శాసీ్త్రయ పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి సేకరించే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం, కాల్చివేయడం వంటి చర్యలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. భారీ స్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఫంక్షన్‌హాళ్లను బల్క్‌ వేస్ట్‌ జనరేటర్లుగా గుర్తించాలన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు, వ్యర్థాల ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, మౌలిక వసతుల కల్పనపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన బట్ట సంచులను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement