జగద్గిరిగుట్ట: ప్రేమ వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో జగద్గిరిగుట్ట కొండపై ఉన్న గోవిందరాజు స్వామి ఆలయంలో గురువారం పెద్దల సమక్షంలో ఆ ప్రేమ జంట వివాహం చేశారు. మెదక్ జిల్లాకు చెందిన అఖిల్ (26), దివ్యలత (25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అఖిల్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. దివ్యలత ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. చింతల్‌లో ఉంటున్న వీరు ఇంట్లో పెద్దలకు పెళ్లి విష యం చెప్పగా.. కులాంతర వివాహానికి అంగీకరించ లేదు. దీంతో స్థానిక జగద్గిరిగుట్టకు చెందిన ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్‌ను సంప్రదించగా.. ఆయన మెదక్ జిల్లా గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దొంతి చంద్రగౌడ్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం వీరి సమక్షంలో జగద్గిరిగుట్ట గోవిందరాజు స్వామి ఆలయంలో ఇరువురి అంగీకారంతో వివాహం జరిపించారు. కార్యక్రమంలో గోవిందరాజు స్వామి ఆలయ వ్యవస్థాపకులు నరహరి రవి, శంకర్, రాజు పాల్గొన్నారు.
ఆలయంలో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి


