ప్చ్.. ఏం బాగోలేదు!
● అశాసీ్త్రయంగా డివిజన్‌ల పునర్విభజన
● అమీన్‌పూర్‌ను ముక్కలు చేయడం దారుణం
● డివిజన్‌ల ఏర్పాటుపై స్థానికుల అసంతృప్తి
పటాన్‌చెరు: గ్రేటర్‌లో కార్పొరేట్ డివిజన్ల పునర్విభజన సరైన పద్ధతిలో జరగలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమీన్‌పూర్ గ్రామాన్ని విడగొట్టి సుల్తాన్‌పూర్‌లో విలీనం చేయడం ఎంత మాత్రం సరైంది కాదన్నారు. అలాగే కిష్టారెడ్డిపేటను రెండు ముక్కలు చేస్తూ నిర్వహించిన పునర్విభజనపై పెదవి విరుస్తున్నారు. పటాన్‌చెరు డివిజన్‌ను విభజించి కొత్తగా జేపీ కాలనీ పేరుతో రూపొందిన డివిజన్ పరిధిలోకి తెచ్చిన ప్రాంతాలను ఏ పద్ధతిలో చేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రోడ్లు, సహజ వనరులైన కాల్వలను పొలిమేర్లుగా చూపుతూ డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే ఎంతో కాలంగా కలిసి ఉన్న గ్రామాలు, ప్రాంతాలను విడదీసి వేరే ప్రాంతం వైపు కలిపి కొత్త డివిజన్‌గా చేయడం పట్ల స్థానిక నాయకులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అమీన్‌పూర్‌లోని ఓ భాగం (ఏరియల్ వ్యూ)
అమీన్‌పూర్‌ను ముక్కలు చేశారు
అమీన్‌పూర్‌ను ముక్కలు చేశారు. హెచ్‌ఎంటీ, పీజేఆర్‌తో పాటు ఇతర కాలనీలను దీప్తి శ్రీనగర్‌లో విలీనం చేయడం దారుణం. అమీన్‌పూర్ గ్రామా న్ని ముక్కలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు. అమీన్‌పూర్‌ను ఛిన్నాభిన్నం చేశారు. పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. పార్టీ ఆదేశాల మేరకు పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. –ఆదెల్లి రవీందర్, బీజేపీ నేత
ఆక్షేపణలు తెలపవచ్చు
అమీన్‌పూర్ మొత్తం హైదరాబాద్‌లో 300 డివిజన్లను రూపకల్పన చేశారు. పునర్విభజన ప్రక్రియ ఇంతటితోనే ముగియలేదు. ప్రజలెవరైనా లిఖిత పూర్వకంగా తమ ప్రాంతాల్లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని అధికారులకు తమ ఆక్షేపణలు అందించవచ్చు. వారం రోజుల వరకు వార్డు డిలిమెటేషన్ ప్రక్రియపై ఆక్షేపణలు తీసుకుంటారు.
–జ్యోతిరెడ్డి, ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్
ప్చ్.. ఏం బాగోలేదు!
ప్చ్.. ఏం బాగోలేదు!


