ఠారెత్తిస్తున్న విద్యుత్ బిల్లులు
పటాన్‌చెరు టౌన్: సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడంతో విద్యుత్ బిల్లులు 60 శాతం మేర పెరిగిపోయాయని పటాన్‌చెరు ఐలా ఛైర్మన్ సుధీర్ రెడ్డి, రామచంద్రపురం ఐలా చైర్మన్ క్రాంతి కిరణ్ తెలిపారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఐలా భవన్ నుంచి విద్యుత్ డీఈ కార్యాలయం వరకు పారిశ్రామిక వేత్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈ భాస్కర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
విద్యుత్ అధికారులు ఇచ్చిన నోటీసు స్పష్టంగా లేదన్నారు. ఉదయం పని చేసిన సమయంలోనే కాకుండా, రాత్రి వేళ పని చేయని సమయంలో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించమంటున్నారని పేర్కొన్నారు. గత విద్యుత్ బిల్లుల కంటే 60 శాతం పెరిగాయని తెలిపారు. పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని కోరారు. అకస్మాత్తుగా కెపాసిటర్లు కొనుగోలు చేసుకోవాలంటే సాధ్యంకాదన్నారు. ఈ విషయమై డీఈ భాస్కర్ మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఐలా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కుటుంబ రావు, ఏవీ రావు, రంజిత్, సలీం తదితర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
సాఫ్ట్‌వేర్ అప్డేట్‌తో 60శాతం మేర పెరిగాయి
పటాన్‌చెరు ఐలా ఛైర్మన్ సుధీర్ రెడ్డి
డీఈ కార్యాలయం ఎదుట పారిశ్రామికవేత్తల ధర్నా


