ఎన్నికల నియమావళి పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళి పాటించాలి

Dec 11 2025 9:56 AM | Updated on Dec 11 2025 9:56 AM

ఎన్ని

ఎన్నికల నియమావళి పాటించాలి

ఎన్నికల నియమావళి పాటించాలి కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

పరిశీలకులు శేషగిరిరావు విజ్ఞప్తి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): పంచాయతీ ఎన్నికల్లో నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు శేషగిరిరావు సూచించారు. బుధవారం కల్హేర్‌లో సర్పంచ్‌, వార్డు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఖర్చు వివరాలు ఎపటికప్పుడు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్వర్‌రావు, ఏపీఎం వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి

పటాన్‌చెరు టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సంజీవరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి మతీన్‌, ఆ పార్టీ నాయకులు యువరాజ్‌, రవి ముదిరాజ్‌, సాయిలు ముదిరాజ్‌, ఈశ్వర్‌ సింగ్‌ శ్రీనివాస్‌ అక్షిత్‌ రాజు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు పత్తి

కొనుగోళ్లు బంద్‌

గజ్వేల్‌రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌ మండలం పిడిచెడ్‌ సమీపంలోని ఈశ్వరసాయి కాటన్‌ ఇండస్ట్రీస్‌, సాయి బాలాజీ కాటన్‌ ఇండస్ట్రీస్‌, శివగంగా కాటన్‌ ఇండస్ట్రీస్‌(బయ్యారం)తో పాటు పట్టణ శివారులోని శ్రీ వాసవి కాటన్‌ ఇండస్ట్రీస్‌(జిన్నింగ్‌ మిల్‌)లలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగవని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజున కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌ ఉండదని, గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మూసి ఉంటుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

ఇటు చలి..

అటు ప్రచార వేడి

బెజ్జంకి(సిద్దిపేట): చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు చలికి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. కొందరు చలిమంటల వద్ద కూర్చుండిపోతున్నారు. ఇదే అదనుగా అభ్యర్థుల మద్దతుదారులు అక్కడికి చేరుకుని ప్రచార వేడిని పెంచుతున్నారు. బెజ్జంకి క్రాసింగ్‌లో చలిమంట వేసుకున్న దృశ్యాన్ని బుధవారం సాక్షి క్లిక్‌ మనిపించింది.

ఎన్నికల ‘సిత్రం’

ప్రచారంలో ‘ఏఐ’ కనికట్టు

మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) రాకతో లేని జనాలను ఉన్నట్టు చిత్రిస్తూ ప్రచారాన్ని ఊపందిస్తున్నారు. విభిన్న రీతిలో తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారంతో దూసుకెళ్తున్నారు. జనాలను వెంటేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఏఐ సాయంతో ఫొటోలను క్రియేట్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తమకు నచ్చిన హీరోల చేతిలో తమకు కేటాయించిన గుర్తులను పెట్టి అభ్యర్థిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఎన్నికల నియమావళి పాటించాలి
1
1/1

ఎన్నికల నియమావళి పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement