ప్రజలకు ఉచిత న్యాయ సేవలు
నర్సాపూర్ రూరల్: పేద , మధ్య తరగతి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సేవ అధికార సంస్థను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యం.హేమలత పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిఫ్ కోర్టు భవనం ఆవరణలో ఉచిత న్యాయ సేవల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సుప్రీం, హైకోర్టులు ప్రజలందరికీ సమానంగా న్యాయం జరగాలని న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రంజిత్ రెడ్డి, ఎకై ్సజ్ ఎస్సై అరుణ, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూప రాణి, లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మధు శ్రీ, న్యాయవాదులు అంజిరెడ్డి, జాఫర్, ఖాజా మొయినుద్దీన్, ఏ.శ్రీనివాస్, కేఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి


