యువకుడి అదృశ్యం
కల్హేర్(నారాయణఖేడ్): యువకుడు అదృశ్యమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సిర్గాపూర్ ఎస్‌ఐ మహేశ్‌కుమార్ వివరాల ప్రకారం... వాసర్ గ్రామానికి చెందిన మాలి పాటిల్ దత్తు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 23న గ్రామానికి వచ్చాడు. అక్కడి నుంచి గ్రామానికి చెందిన బిరదర్ హన్మంత్‌తో కలిసి కంగ్టీ మండలం నాగన్‌పల్లికి వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. దత్తు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


