ఘనంగా భారత్ స్కౌట్స్ – గైడ్స్ ర్యాలీ
మెదక్‌జోన్: భారత్ స్కౌట్స్– గైడ్స్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ రాధాకిషన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. అంతకు ముందు మహాత్మా జ్యోతిభాపూలే బీసీ గురుకుల పాఠశాలలో స్కౌట్స్ – గైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాంపెయినింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన గుడారాలను పరిశీలించి స్కౌట్స్ గైడ్స్ శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అదనపు ఎస్పీ మహేందర్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


