బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కే
మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
రామచంద్రాపురం (పటాన్‌చెరు): కేంద్రంలో బీజేపీనీ ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకే మాత్రమే ఉందని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాత్రి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌లో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ నివాసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతీ పేదవానికి రేషన్ కార్డు ఇచ్చినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే సుమారు 15 వేల రేషన్ కార్డులిచ్చినట్లు వెల్లడించారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నామని చెప్పారు.


