 
															గుంతలు మిగిల్చిన మోంథా
మోంథా తుపాను కారణంగా సంగారెడ్డి నుంచి పెద్దాపూర్ వెళ్లేదారిలో రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారింది. దీంతో మూడు రోజులుగా హాస్టల్‌గడ్డ నుంచి
చింతలపల్లి, ఇరిగిపల్లి, పెద్దాపూర్ మీదుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు తెలియక నీళ్ళల్లో పడిపోతున్నారు. దశాబ్దకాలంగా ఈ ప్రాంత వాసులకు రహదారి సమస్య ఉన్నా అధికారులు చొరవ చూపడంలేదని జనం వాపోతున్నారు.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
